పాక్ క్రికెటర్ పై విరుచుకుపడుతున్న అభిమానులు... కారణం 

పాక్ క్రికెటర్ పై విరుచుకుపడుతున్న అభిమానులు... కారణం 

పాక్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ హాసన్ అలీ పై అభిమానులు విరుచుకుపడుతున్నారు.  కారణం ఏంటి అంటే... చాలా ఉన్నది.  ఇటీవలే ఈ బౌలర్ శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నాడు.  కారణం పక్కటెముకకు దెబ్బ తగిలిందని అంటున్నారు.  అందుకే ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నాడు.  ఇలా మ్యాచ్ లకు దూరంగా ఉన్న ఈ బౌలర్ ఇటీవలే ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు.  

ఫ్యాషన్ షోలో పాల్గొన్న హాసన్ ఆలీపై అభిమానులు తమదైన శైలిలో సెటర్లు వేస్తున్నారు.  పాకిస్తాన్ క్రికెట్ లీగ్ కు అందుబాటులో ఉండే హాసన్ అలీ.. టెస్ట్ మ్యాచ్ లకు దూరంగా ఉండటం విచిత్రం అన్నారు.  కమెడియన్స్ ను దేశం తరపున ఆడనివ్వకూడదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  హాసన్ ఆలీపై వస్తున్న కామెంట్లపై అయన ఎలా స్పందిస్తారో చూడాలి.