భారత్ తో త్వరలోనే యుద్ధం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు 

భారత్ తో త్వరలోనే యుద్ధం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు 

ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా.. పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.  ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు చాలా వరకు తెగిపోయాయి.  ప్రస్తుతం కాశ్మీర్ లో యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కాశ్మీర్లో పర్యటిస్తున్నారు.  వీరు పర్యటించే సమయంలో కాశ్మీర్లో కొందరు ఉగ్రవాదులు అమాయకుల ప్రజలను, వలస కూలీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిన సంగతి తెలిసిందే.  అంతర్జాతీయంగా ఇండియాను దోషిగా నిలబెట్టాలని ఉగ్రవాదుల సహకారంతో పాక్ ఇలా చేస్తోంది.  

ఇదిలా ఉంటె, పాకిస్తాన్ మంత్రి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  కాశ్మీర్ విషయంలో ఇండియా తన వైఖరి మార్చుకోకుంటే.. యుద్ధం తప్పదని, ఇండియాకు సపోర్ట్ దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తామని హెచ్చరించాడు.  పాక్ మంది అమీన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  అమీన్ చేసిన వ్యాఖ్యలను అనేకమంది కొట్టిపారేస్తున్నారు.   పాక్ తీరు చూస్తుంటే ఇండియాతో గొడవకు దిగాలనే చూస్తున్నట్టుగా ఉంది.  ఇప్పటికే అంతర్జాతీయంగా పాక్ ఒంటరిగా మారిపోయింది.  ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఉగ్రవాదులను ప్రేరేపించడం చేస్తే మరిన్ని కఠిన చర్యలు తప్పవు.