పార్లమెంట్ ముందు పరువు పోగొట్టుకున్న పాక్ మంత్రి..!! 

పార్లమెంట్ ముందు పరువు పోగొట్టుకున్న పాక్ మంత్రి..!! 

అక్టోబర్ లో పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం వస్తుందని చెప్పిన పాక్ రైల్వేశాఖ మంత్రి రషీద్ ఏదో ఒక విషయంపై నిత్యం వార్తల్లో ఉంటున్నాడు.  ఇటీవలే ఈ మంత్రిగారు ఓ కారు తీసుకున్నారు.  జపాన్ నుంచి ఓ వ్యక్తి ఆయనకు కారు పంపించారు.  డబ్బులు మాత్రం ఇప్పటి వరకు చెల్లించలేదట.  పాపం అడిగి అడిగి విసుగుపుట్టిన సదరు వ్యక్తి... మంత్రిని వెతుక్కుంటూ జపాన్ నుంచి పాకిస్తాన్ వెళ్లాడు.  

పాక్ లో పార్లమెంట్ దగ్గర మంత్రిని అడ్డుకున్నాడు.  డబ్బులు ఇవ్వాలని, ఎన్నిసార్లు అడిగినా ఏదోఒకటి చెప్పి తప్పించుకుంటున్నారని అంటూ పెద్దపెద్దగా కేకలు వేశాడట.  ఒక మంత్రిని పార్లమెంట్ దగ్గర అడ్డుకొని గొడవకు దిగటం అంటే మాములు విషయం కాదు.  ఆ కారు విలువ కోట్లలో ఉందని అనుకుంటే పొరపాటే.  కేవలం దాని ధర 22 లక్షల పాక్ రూపాయలే. ఒక మంత్రిస్థానంలో ఉన్న వ్యక్తి ఆ డబ్బును కూడా చెల్లించలేదంటే అర్ధం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందొ. దీనికి సంబంధించిన ట్విట్టర్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  అంతే... క్షణాల్లోనే వీడియో వైరల్ అయ్యింది.