ఇమ్రాన్ ఖాన్ సహాయకుడికి భీకర ట్రోలింగ్

ఇమ్రాన్ ఖాన్ సహాయకుడికి భీకర ట్రోలింగ్

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు నయీమ్-ఉల్-హక్ ని ఆయన చేసిన ఒక ట్విట్టర్ పోస్ట్ పై భీకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురించి ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో ఆయన పాక్ పీఎం స్థానంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఫోటో పెట్టి శీర్షికలో 'పీఎం ఇమ్రాన్ ఖాన్ 1969' అని రాశారు. ఈ ఫోటో షేర్ చేయగానే ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ యూజర్లు సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేయడం ప్రారంభించారు. దాదాపు వివిధ రంగాల ప్రముఖుల ఫోటోలు పెట్టి వేరే వ్యక్తులుగా చెప్పసాగారు.

ఒకరు అసదుద్దీన్ ఒవైసీ ఫోటో ట్వీట్ చేసి పాకిస్థానీ క్రికెటర్ సయీద్ అన్వర్ అని రాశాడు

ఒక యూజర్ విరాట్ కోహ్లీ చిన్నప్పటి ఫోటో ట్వీట్ చేసి పాకిస్థాన్ బ్యాటింగ్ దిగ్గజం ఇంజమాముల్ హక్ 1976 అని పేర్కొన్నాడు.

ఇక ఇతర పోస్టుల్లో కూడా సల్మాన్ ఖాన్ ఫోటో పెట్టి ఇతను పాకిస్థానీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ అని ఒకరు రాశారు. నయీమ్ ఉల్ హక్ ను ట్రోల్ చేయడం ఇక్కడితో ఆగేలా లేదు.

మరో ట్వీట్ లో ఒక యూజర్ నరేంద్ర మోడీ ఒక పాత ఫోటో పోస్ట్ చూస్తూ ఈయన పరేష్ రావల్ అని చెప్పారు.

ఇంకో యూజర్ లగాన్ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఫోటో షేర్ చేస్తూ 1857లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అని రాశాడు.

పాక్ పీఎం సహాయకుడి ఈ ట్వీట్ ని 700 మందికి పైగా రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని 7,000 మందికి పైగా లైక్ కొట్టారు.