పంజాబ్ మంత్రి సిద్ధూకి ఇమ్రాన్ ఆహ్వానం

పంజాబ్ మంత్రి సిద్ధూకి ఇమ్రాన్ ఆహ్వానం

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నుంచి మరోసారి పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూకి ఆహ్వానం అందింది. ఈనెల 28న భారత్‌-పాకిస్థాన్‌ బోర్డర్ కు చేరువగా నిర్మించబోతున్న కర్తార్‌పుర్‌ సాహిబ్‌ కారిడార్  శంకుస్థాపనకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. రెండు దేశాల్లోని జరగబోతున్న కారిడార్ నిర్మాణానికి ఈ నెల 26న భారత్‌వైపు పనులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శంకుస్థాపన చేస్తున్నారు. పాక్‌వైపు 28న ఇమ్రాన్‌ఖాన్‌ పునాదిరాయి వేయనున్నారు. రెండు దేశాల్లో పనులు పూర్తయితే వచ్చే ఏడాది నవంబరులో గురునానక్‌ 550వ జయంతి నాటికి భారతదేశ సిక్కులు- గురుద్వారా నానక్‌ సాహిబ్‌లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది ఆగస్టులో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారానికి సిద్ధూ హాజరైనప్పుడు ఈ అంశాన్ని గుర్తుచేశారు.దాంతో కర్తార్ పుర్ కారిడార్ కు మార్గం సుగమమైంది.