కాశ్మీర్లో విధ్వంసానికి పాక్ భారీ కుట్ర.. !!!

కాశ్మీర్లో విధ్వంసానికి పాక్ భారీ కుట్ర.. !!!

ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి.  మరి కొన్ని రోజుల్లోనే అన్ని సర్దుకుంటాయని కేంద్రం చెప్తున్నది.  జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రం ఇప్పటికే కొన్ని వరాలను ప్రకటించింది.  జమ్మూలో ఇప్పటికే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.  కాశ్మీర్లో మరికొన్ని రోజుల్లోనే పరిస్థితులు సద్దుమణుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.  

ఇదిలా ఉంటె,  పాక్ లో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘావర్గాలు హెచ్చరించాయి.  ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇండియా అలర్ట్ అయ్యింది.  నిఘావర్గాల హెచ్చరికల ప్రకారం ఒక్క కశ్మీర్‌లోనే 273 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని నిఘావర్గాలు తెలిపాయి. దక్షిణ కశ్మీర్‌లో 158 మంది, ఉత్తర కశ్మీర్‌లో 96, కశ్మీర్‌ మధ్య ప్రాంతంలో 19 మంది ఉగ్రవాదులను గుర్తించినట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి.  ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్లో అలజడులు సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘావర్గాలు హెచ్చరించినట్టు ఓ జాతీయ మీడియా పేర్కొన్నది.