పాక్ యూటర్న్... చెల్లించాల్సిందే.. 

పాక్ యూటర్న్... చెల్లించాల్సిందే.. 

కర్తార్ పూర్ కారిడార్ ను గురుదాస్ పూర్ లో ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. అటు పాకిస్తాన్ లోని కారిడార్ ను పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రారంభించబోతున్నారు.  గురుదాస్ పూర్ నుంచి పాక్ లో ఉన్న గురుద్వారా సాహెబ్ కు వెళ్ళడానికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరం.  చాలా తొందరగా ఈజీగా దర్శనం చేసుకొని రావొచ్చు.  గతంలో లాహోర్ వెళ్లి అక్కడి నుంచి గురుద్వారా చేరుకొని దర్శనం చేసుకోవాల్సి వచ్చేది.  

ఈ కారిడార్ ఓపెనింగ్ తరువాత గురునానక్ జయంతి రోజున వచ్చే భారతీయులకు పాస్ పోర్ట్ అవసరం లేదని, 20డాలర్ల ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది.  దీంతో భారతదేశం నుంచి గురుదాస్ పూర్ మీదుగా గురుద్వారా వెళ్లేందుకు అనేకమంది సిద్ధం అయ్యారు.  ఉన్నట్టుండి, పాకిస్తాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంది.  గురుద్వారా వచ్చే యాత్రికులకు పాస్ పోర్ట్ తప్పనిసరి అని, అలానే 20 డాలర్ల ఫీజు కూడా చెల్లించాల్సిందే అని పాక్ తెలిపింది. దీంతో సిక్కు యాత్రికులు అయోమయంలో పడిపోయారు.  వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు.