పాకిస్థాన్ క్లీన్ స్వీప్

పాకిస్థాన్ క్లీన్ స్వీప్

మూడో టీ-20లోనూ కివీస్ ను ఓడించి పాకిస్థాన్ 3-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో టీ-20 ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ జట్టుగా నిలిచింది. పాకిస్థాన్ స్దాయికి తగ్గ ఆటతో కివీస్ ను మట్టికరిపించింది. తొలుత పాక్ మూడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఓపెనర్ బాబర్ ఆజమ్ (58 బంతుల్లో 79; 7 ఫోర్లు, 2 సిక్స్ లు), హఫీజ్ (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్ లు) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ (38 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్స్ లు), ఓపెనర్ గ్లెన్ ఫిలిప్స్ (26) మినహా ఎవరూ పోరాడలేదు. దీంతో 16.5 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. షాదాబ్ ఖాన్(3/30), వకార్ మక్సూద్(2/21), ఇమాద్ వసీం(2/28) ప్రత్యర్ధి జట్టును దెబ్బతీశారు.