ఇండియాకు సవాల్ విసురుతున్న పాక్ వాయుసేన... కారణం ఇదే... 

ఇండియాకు సవాల్ విసురుతున్న పాక్ వాయుసేన... కారణం ఇదే... 

ఏ దేశానికైనా రక్షణ వ్యవస్థ చాలా కీలకమైన అంశంగా ఉంటుంది.  రక్షణ రంగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.  ఎప్పుడైనా ఏదైనా తేడా జరిగితే మాత్రం ఆ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది.  అందుకే ప్రతి దేశం కూడా రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అత్యధిక బడ్జెట్ ను దానికోసమే ఇస్తుంటాయి.  అయితే, గత కొంతకాలంగా రక్షణ రంగానికి ఇండియా ఇస్తున్న బడ్జెట్ కొంత తగ్గుతూ వస్తున్నది.  

ఇండియా ఆధునిక ఆయుధాలను సమకూర్చుకొని చాలా కాలం అయ్యింది.  మనకంటే చిన్నదేశం, శత్రుదేశంగా ఉన్న పాకిస్తాన్ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడమే కాకుండా, వాయుసేనను ఆధునీకరిస్తోంది.  ఎఫ్ 35 విమానాలతో ఆ దేశం పటిష్టంగా ఉన్నది. ఇండియా ఇంకా కాలం చెల్లిన విమానాలను వాడుతున్నది.  కార్గిల్ యుద్ధం తరువాత ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.  అంతేకాదు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అవాక్స్ తో అనుసంధానం కలిగిన విమానాలు మన దగ్గర నాలుగు మాత్రమీ ఉన్నాయి.  కానీ, పాక్ దగ్గర ఇవి 10 విమానాలు ఉండటం మన దేశాన్ని భయపెడుతున్నది.  ఈ ముందస్తు హెచ్చరిక వ్యవస్థతో విమానాలను శత్రువుల బారినుంచి రక్షించుకోవచ్చు.  దాడి చెయ్యొచ్చు.  బాలాకోట్ దాడుల సమయంలో మన విమానాన్ని మనమే కూల్చుకోవడంలో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియాకు రాబోయే రఫెల్ విమానాలతో రక్షణ రంగం కొంతవరకు పటిష్టం అవుతుంది.  రక్షణ రంగంలో నౌకాదళం కూడా ఒకటి.  ఈ రంగానికి కూడా పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించడం లేదు. త్రివిధ దళాలకు బడ్జెట్ కేటాయించినా ఎక్కువ భాగం జీతాలు, ఇతర చెల్లింపులకు సరిపోతుంది.  ఇండియా సొంతంగా ఆయుధాలను తయారు చేసుకోగలిగితేనే రక్షణ రంగం పటిష్టంగా ఉంటుంది.  లేదంటే ఇలా ఇబ్బందులు పడుతూనే ఉండాలి.