రేపటి టెస్ట్ మ్యాచ్ కు జట్టును ప్రకటించిన పాకిస్థాన్...

రేపటి టెస్ట్ మ్యాచ్ కు జట్టును ప్రకటించిన పాకిస్థాన్...

ఆగస్టు 5 నుండి 25 వరకు ఇంగ్లాండ్ తో జరగబోయే 3 టెస్టుల సిరీస్‌ లో మొదటి టెస్ట్ మ్యాచ్ కు16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును పాకిస్థాన్ ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ కు ఇంగ్లాండ్ తమ జట్టును ఎప్పుడో ప్రకటించేసింది. ఇంగ్లాండ్ కు రావడానికి ముందు పాక్ జట్టులో కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్‌ కు ముందు వెస్టిండీస్ తో ఆడిన సిరీస్ లో ఇంగ్లాండ్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. మరి ఇందులో ఎవరు విజయం సాదిస్తారు అనేది చూడాలి. 

పాకిస్థాన్ జట్టు : అజహర్ అలీ (కెప్టెన్), బాబర్ అజామ్, అబిద్ అలి, అసద్ షాఫిక్, పవాద్ అలామ్, ఇమామ్ ఉల్ హక్, ఖాసిప్ భట్టీ, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్(వికెట్ కీపర్), షదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, షాన్ మసూద్, సొహైల్ ఖాన్, యాసీర్ షా
 
ఇంగ్లాండ్ జట్టు : పాక్ సిరీస్ కు ఇంగ్లాండ్ జట్టు : జో రూట్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జోప్రా ఆర్చర్, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాక్ క్రావ్లీ, శామ్ కరణ్, ఓలీ పోప్, డొమ్ సిబ్లీ, బెన్‌స్టోక్స్, క్రిస్‌వోక్స్, మార్క్‌వుడ్