సంచలన నిర్ణయం తీసుకున్న పాక్ ప్రభుత్వం

సంచలన నిర్ణయం తీసుకున్న పాక్ ప్రభుత్వం

పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నల్లదనం వెలికితీసేందుకు అమ్నెస్టీ పథకానికి అమోదం తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులు ప్రకటించని ఆస్తులను క్రమబద్దీకరించుకోవడానికి అవకాశం కల్పించింది. స్వదేశంలో, విదేశాల్లో ఉన్న అక్రమ ఆస్తులను బయటికి తేవాలన్న ఉద్దేశ్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు పాకిస్థాన్ ఆర్ధిక శాఖ మంత్రి, ఫైనాన్స్ సలహాదారు అబ్ధుల్ హఫీజ్ షేఖ్ తెలిపారు.