ప్రియాంక చోప్రానూ వదలని పాక్..!!

ప్రియాంక చోప్రానూ వదలని పాక్..!!

కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తన తీరును మార్చుకునేవిధంగా కనిపించడం లేదు.  నిత్యం ఏదోఒక విషయంలో కంప్లైంట్ చేస్తూనే ఉన్నది.  పదేపదే అమెరికా అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తూ వస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ప్రియాంక చోప్రాపై యూనిసెఫ్ లో ఫిర్యాదు చేసింది.  భారత్ అణ్వస్త్ర విధానం వలన పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని, భారత్ తీసుకుంటున్న నిర్ణయాలను యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక చోప్రా మద్దతు ఇస్తోందని, ఆమెను వెంటనే గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తొలగించాలని చెప్పి పాక్ మానవ హక్కుల శాఖామంత్రి షిరీన్ మజారీ యూనిసెఫ్ కు లేఖ రాసింది.  

యూనిసెఫ్ కు లేఖ రాసినట్టు ఆ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.  ఇది పాకిస్తాన్ దిగజారుడు తనానికి ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. గతంలో పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ లోని బాలాకోట్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేయడాన్ని ప్రియాంక చోప్రా సమర్ధిస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.