ఇండియన్ సినిమాలను బ్యాన్ చేసిన పాక్ !

ఇండియన్ సినిమాలను బ్యాన్ చేసిన పాక్ !

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీ ఆర్టిస్టులను మన సినీ పరిశ్రమలు బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.  అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ హీరోలు కొందరు తమ సినిమాలు పాకిస్థాన్లో విడుదలకావని ప్రకటించారు.  తాజాగా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్థాన్ భూభాగంలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది.  దీంతో పాక్ భారతీయ చిత్రాలను, ప్రకటనల్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.  ఈమేరకు పాక్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ఎలక్ట్రానిక్ మీడియా అథారిటీ ప్రకటన వెలువరించింది.