పాక్ ఖాతాలో మరో విజయం

పాక్ ఖాతాలో మరో విజయం

ఐసీసీ వరల్డ్ కప్‌ 2019లో పాకిస్థాన్ జట్టు మరో గ్రాండ్ విక్టరీ కొట్టింది. బర్మింగ్‌హామ్ వేదికగా బుధవారం పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‎లో 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసి.. పాక్ ముందు 238 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో జేమ్స్ నీషామ్ 97, గ్రాండ్‌హోమ్ 67, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 41 పరుగులు చేశారు. ఇక 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మరో 6 వికెట్లు మిగిలి ఉండగాన్ని లక్ష్యాన్ని ఛేదించింది. సెంచరీ చేసిన బాబర్ 101(నాటౌట్), సోహైల్ 68తో పాక్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 

న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌: గప్తిల్‌ 5, మన్రో 12, విలియమ్సన్‌ 41, రాస్‌ టేలర్‌ 3, లేథమ్‌ 1, నీషమ్‌ 97 (నాటౌట్‌), గ్రాండ్‌హోమ్‌ 64, శాంట్నర్‌ 5 (నాటౌట్‌)
పాకిస్థాన్‌ బ్యాటింగ్‌: ఇమాముల్‌ హక్‌ 19, ఫకర్‌ జమాన్‌ 9, బాబర్‌ అజామ్‌ 101 (నాటౌట్‌), హఫీజ్‌ 32, హారిస్‌ సోహైల్‌ 68, సర్ఫ్‌రాజ్‌ 5 (నాటౌట్‌)