డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన పాకిస్థాన్ నౌక

డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన పాకిస్థాన్ నౌక

గుజరాత్‌ తీరంలో రూ 600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను తరలిస్తున్న పాకిస్తాన్‌కు నౌకను భారత తీరప్రాంత గస్తీ దళం పట్టుకుంది. కోస్ట్‌ గార్డ్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ సంయుక్త ఆపరేషన్‌లో 100 కిలోల హెరాయిన్‌ను రవాణా చేస్తున్న ఈ ఫిషింగ్‌ నౌక పట్టుబడింది. ఈ నౌక నుంచి 200 హెరాయిన్ ప్యాకెట్లను భారత కోస్ట్‌ గార్డ్‌ స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తానీ నౌక అల్‌ మదీనాను సీజ్‌ చేసి, సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అల్‌ మదీనా పేరుతో పాక్‌ నౌకను కరాచీలో రిజిస్టర్‌ చేసినట్టు అధికారులు గుర్తించారు. తదుపరి దర్యాప్తు కోసం పట్టుబడిన సిబ్బందితో సహా నౌకను జకువ హార్బర్‌కు తరలించారు.