స్పాన్సర్స్ లేక సతమతమవుతున్న పాక్ బోర్డు...    

స్పాన్సర్స్ లేక సతమతమవుతున్న పాక్ బోర్డు...    

కరోనా విరామం తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు టెస్ట్, టీ 20 సిరీస్ ఆడటం కోసం ఇంగ్లాండ్ కు వెళ్ళారు. అప్పుడు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు సరిగ్గా నిర్వహించలేక సతమతమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చింది. అదే స్పాన్సర్షిప్. అయితే పీసీబీకి ఇంతక ముందు పెప్సీ కంపెనీ స్పాన్సర్ గా ఉండేది. ఇక ఈ కరోనా లాక్ డౌన్ సమయం లో ఆ ఒప్పందం ముగిసింది. దాంతో మళ్ళీ టెండర్స్‌కు ఆహ్వానించింది పీసీబీ.  అప్పుడు పెప్సీ తప్ప మరో కంపెనీ  ముందుకు రాలేదు. అయితే దొరికిందే అవకాశం అనుకోని పెప్సీ కంపెనీ కూడా ఇంతక ముందు కంటే దాదాపు 40 శాతం ధరను తగ్గించింది. దాంతో అప్పటికి ఆ ప్రయత్నాలు ఆపిన పీసీబీ ఇప్పుడు మళ్ళీ స్పాన్సర్స్ వేటలో పడింది. ఎందుకంటే వచ్చే నెలలో పాక్ జట్టు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అప్పటివరకు కూడా  పీసీబీకి స్పాన్సర్స్ దొరకకపోతే పాక్ ఆటగాళ్ల జెర్సీ పైన పీసీబీ లోగో తప్ప ఇంకోటి ఉండదు. చూడాలి మరి అప్పటివరకు పీసీబీ కొత్త వారిని పెట్టుకుంటుందా! లేక పెప్సీ తోనే  మళ్ళీ ఒప్పందం కుదుర్చుకుంటుందా అనేది.