ఆసియా కప్ కు పాకిస్థాన్ జట్టు ఇదే

ఆసియా కప్ కు పాకిస్థాన్ జట్టు ఇదే

ఆసియా కప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టుని పాక్ సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి ఆసియా కప్ ప్రారంభమవనుంది. ఈ టోర్నీ కోసం 16 మందితో కూడిన పాక్ జట్టుని చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సీనియర్ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్, ఇమాద్ వసీమ్‌పై సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ షాన్ మసూద్ కు మొదటిసారి పాక్ వన్డే జట్టులో చోటు కల్పించారు.

ఆసియా కప్ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఒక క్వాలిఫయర్ జట్టు పోటీపడనున్నాయి. సెప్టెంబర్ 16న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్‌ని పాకిస్థాన్ ఆడనుంది. అనంతరం సెప్టెంబర్ 19న భారత్‌తో పాక్ తలపడనుంది. దాదాపు ఏడాది కాలం తర్వాత మళ్లీ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

జట్టు:

సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ అజామ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, హారీస్ సోహాలి, సదాబ్ ఖాన్, మహ్మద్  నవాజ్, అష్రప్, హసన్ అలీ, మహ్మద్ అమీర్, జునైద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది.