అయోధ్య రామమందిరం భూమిపూజ పై స్పందించిన  పాక్ క్రికెటర్...

అయోధ్య రామమందిరం భూమిపూజ పై స్పందించిన  పాక్ క్రికెటర్...

అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిన్న భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై పాకిస్థాన్ క్రికెటర్ స్పందించారు. అయితే ఇప్పటివరకు పాక్  తరపున క్రికెట్  ఆడిన హిందువులు కేవలం ఇద్దరు మాత్రమే. అందులో డానిష్ కనేరియా ఒకడు. కాని ప్రస్తుతం ఈ ఆటగాడు  జీవితకాల నిషేధాన్ని ఎదుర్కుంటున్నాడు. ఇక కనేరియా అయోధ్య రామ మందిర భూమి పూజ పై ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అందులో భూమి పూజకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ "అయోధ్యలో ఇది ఒక ఆశీర్వాద దినం. ఈ రోజు ప్రతి భారతీయుడి జ్ఞాపకార్థంగా ఉంటుంది. రాముడి అందం అతని పేరు లో కాకుండా అతని పాత్రలో ఉంది. అతను చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు సంతోషించే రోజు. ఇది హిందువులందరికి సంతృప్తిగా ఉండే క్షణం'' అని తెలిపాడు.