గెలిచినా ఇంటికే.. ముగిసిన కథ..

గెలిచినా ఇంటికే.. ముగిసిన కథ..

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ కథ ముగిసిపోయింది... చివరి లీగ్ మ్యాచ్‌లో భారీ రన్‌రేట్‌తో గెలవాల్సి ఉండగా... పాక్ జట్టు సత్తాచాటలేకపోయింది. బంగ్లాను 316 పరుగుల తేడాతో ఓడిస్తేనే పాక్‌ సెమీస్‌ అవకాశాలు ఉండేవి. కానీ, పాక్ జట్టు 315 పరుగులు మాత్రమే చేసింది. ఇక, ఛేదనలో ప్రత్యర్థిని 7 పరుగులకే ఆలౌట్‌ చేస్తే ఆ జట్టుకు మరో ఛాన్స్‌ ఉండేది. అదీ సాధ్యం కాకపోవడంతో పాక్ జట్టు విమానం ఎక్కడం ఖాయమైపోయింది. పాక్-బంగ్లా మధ్య జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో సర్ఫ్‌రాజ్‌ సేన 94 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచి న్యూజిలాండ్‌తో 11 పాయింట్లతో సమానంగా నిలిచినా... కివీస్‌ మెరుగైన రన్‌రేట్‌తో నాకౌట్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 9 వికెట్ట నష్టానికి 315 పరుగులు చేసింది. ఇమామ్‌ ఉల్‌ హక్‌ 100, బాబర్‌ ఆజమ్‌ 96 పరుగులు చేయడంతో పాక్‌కు ఆ మాత్రం స్కోర్ సాధ్యమైంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌ వైఫల్యంతో బంగ్లా 44.1 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. షకీబల్‌ హసన్‌ 64 పరుగులతో మెరుగైన స్కోర్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. 

పాకిస్థాన్‌ బ్యాటింగ్: ఇమా మ్‌ ఉల్‌ హక్‌ 100, బాబర్‌ ఆజమ్‌ 96, ఇమాద్‌ వసీం 43, మహ్మద్‌ హఫీజ్‌ 27
బంగ్లాదేశ్‌ బ్యాటింగ్: షకీబల్‌ 64, లిట్టన్‌ దాస్‌ 32, మహ్మదుల్లా 29, సౌమ్యసర్కార్‌ 22