గుజరాత్‌లో పాక్ డ్రోన్‌.. పేల్చేసిన సైన్యం!

గుజరాత్‌లో పాక్ డ్రోన్‌.. పేల్చేసిన సైన్యం!

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ భారత భూభాగంలో తచ్చాడింది. ఇవాళ ఉదయం గుజరాత్‌లో ఈ డ్రోన్‌ను గుర్తించిన భద్రతాదళాలు.. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో దాన్ని పేల్చివేశారు. కచ్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న నలియా ఎయిర్‌ బేస్‌ సమీపంలో ఈ డ్రోన్‌ తిరుగాడింది. కశ్మీర్‌తో భారత వాయుసేన దాడులు జరిపిన నేపథ్యంలో గుజరాత్ సహా అన్ని సరిహద్దు ప్రాంతాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా దాడి నేపథ్యంలో భారత్‌ ప్రతీకారం తీర్చుకుంటుందన్న అనుమానంతో పాక్‌ ఈ డ్రోన్‌తో నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.