పాక్ అధికారిక ఫలితాలు ఇవే...

పాక్ అధికారిక ఫలితాలు ఇవే...

పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించింది ఎన్నికల కమిషన్... 119 స్థానాలు కైవసం చేసుకున్న ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన ఐటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక నవాజ్ షరీఫ్ పార్టీ... పీఎంఎల్ -ఎన్‌ 63  స్థానాలు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 38, ఇతరులు 50 స్థానాల్లో గెలుపొందారు. మేజిక్ ఫిగర్ 137 స్థానాలు కావడంతో స్వతంత్రులు కీలకం కానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకన్న పీటీఐ పార్టీ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

ఎన్నికల ఫలితాల తర్వాత దేశప్రజలను ఉద్దేశించి తొలిసారిగా మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్... ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయకుండా... అభివృద్ధి, ప్రజల సమస్యలు, ముందున్న సవాళ్లను ప్రస్థావించారు ఇమ్రాన్ ఖాన్. 22 ఏళ్ల పోరాటం తర్వాత దేశానికి సేవ చేసే అవకాశం వచ్చిందన్నా ఇమ్రాన్. భారత్‌తో సంబంధాలపై కూడా ప్రస్తావించిన ఆయన... తాను ప్రధానిని అయితే భారత్‌కు నష్టమనే రీతిలో ఇండియన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కశ్మీర్ సహా అన్ని సమస్యలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. పాకిస్థాన్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం ఒక్కటే తన కర్తవ్యం అన్నారు. మరోవైపు ఇమ్రాన్ గెలుపు వెనుక సైన్యం కుట్ర ఉందని  నవాజ్ షరీఫ్ పార్టీ ఇప్పటికే ఆరోపించింది.