పాక్ హోటల్ దాడి: ముగ్గురు ఉగ్రవాదులు హతం

పాక్ హోటల్ దాడి: ముగ్గురు ఉగ్రవాదులు హతం

నైరుతి పాకిస్థాన్ రేపు పట్టణం గ్వాదర్ లోని ఓ 5 స్టార్ హోటల్ లోకి రైఫిళ్లు, గ్రనేడ్ లతో చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులను గంటలపాటు సాగిన ఎదురు కాల్పుల్లో సాయుధ బలగాలు హతమార్చాయి. కట్టుదిట్టమైన భద్రత ఉండే పెర్ల్ కాంటినెంటల్ హోటల్ లోకి స్థానిక కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 4.50 నిమిషాలకు ముగ్గరు సాయుధులు చొరబడ్డారు. అడ్డుపడిన హోటల్ సెక్యూరిటీ గార్డును వాళ్లు కాల్చి చంపారు. 

ఎదురు కాల్పులు ప్రారంభించడానికి ముందే తరచుగా చైనా జాతీయులు వస్తుండే ఈ హోటల్ లోని చాలా మంది అతిథులను ఖాళీ చేయించి బయటకు తెచ్చినట్టు బెలూచిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జహూర్ బలేదీ చెప్పారు. సైన్యం, నావికదళి సిబ్బంది ఉగ్రవాదులతో తలపడ్డాయి. చాలా గంటలపాటు కొనసాగిన కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.15కి ఆపరేషన్ ముగిసింది.

ఈ ఉగ్రవాదులు నిషేధిత బలోచ్ లిబరేషన్ ఆర్మీకి చెందినవారని తెలిసింది. ఈ ఎదురుకాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.