పాకిస్తానీ హల్క్ : తిండి చూస్తే షాక్
హల్క్ మ్యాన్ అనగానే మనకు హాలీవుడ్ సినిమా గుర్తుకు వస్తుంది. హల్క్ లాగా మారాలంటే మంచి హైట్ ఉండాలి. దానికి తగిన విధంగా భారీ వైట్ కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే హల్క్ మ్యాన్ గా గుర్తింపు పొందుతారు. పాకిస్తాన్ లో ఓ హల్క్ మ్యాన్ ఉన్నాడు. అతని పేరు అర్బాజ్ హయత్. అతన్ని అందరూ ఖాన్ బాబా అని పిలుస్తారు. అతను తీసుకునే ఆహరం విషయం చూసుకుంటే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద పెద్ద మొత్తంలో కోడిగుడ్లు, 3 కిలోల మాంసం, ఐదు లీటర్ల పాలు తాగుతాడు. అంతేకాదు, ఇక మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ కలుపుకుంటే భారీగా ఉంటుంది. ఒక సామాన్య కుటుంబం నెల రోజులపాటు తినే తిండిని ఖాన్ బాబా ఒక్కరోజులోనే లాగించేస్తాడు. 28 ఏళ్ల వయసు కలిగిన ఈ హల్క్ మ్యాన్ కు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. పిల్ల దొరకడం లేదట. తనలాగే బొద్దుగా ఉండే అమ్మాయిని చేసుకుంటానని అంటున్నాడు. భవిష్యత్తులో డబ్ల్యూ, డబ్ల్యూఎఫ్ పోటీల్లో పాల్గొనాలని కాళీతో పోటీపడాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్టు హల్క్ మ్యాన్ చెప్తున్నాడు. ఇంతకీ ఈ హల్క్ మ్యాన్ బరువు ఎంతో తెలుసా సింపుల్ గా 435 కేజీలు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)