పాక్ మంత్రి మరో లాజిక్ లెస్ ట్వీట్...బెదిరించారట !

పాక్ మంత్రి మరో లాజిక్ లెస్ ట్వీట్...బెదిరించారట !


పాకిస్తాన్ లో జరిగే టెస్ట్ మ్యాచ్ కోసం తాము వెళ్ళమని చెబుతూ శ్రీలంక క్రికెట్ జట్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక క్రికెటర్లు పాకిస్తాన్‌ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం మీద విషయంపై స్పందించిన పాక్‌ మంత్రి ఫవాద్‌ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఈ మేరకు...' పాక్‌లో పర్యటిస్తే ఐపీఎల్‌ ఆడకుండా అడ్డుకుంటామని భారత్‌ శ్రీలంక ఆటగాళ్లను బెదిరించిందని కొంతమంది స్పోర్ట్స్‌ కామెంటేటర్లు తనకు చెప్పారని, భారత క్రీడా అధికారుల మితిమీరిన దేశభక్తికి నిదర్శనమైన ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన ట్వీట్‌ చేశారు. ఇండియా బెదిరింపుల వలెనే  శ్రీలంక క్రికెట్ జట్టు వెనక్కు తగ్గిందని ఆయన ట్వీట్ చేశారు. భారత క్రీడా అధికారులు అట్టడుగు స్థాయి వ్యక్తుల్లా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌ చేపట్టిన ఈ చవకబారు చర్యలను ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.