అభినందన్ వర్ధమాన్‌ విడుదల సీక్రెట్ బయట పెట్టిన పాకిస్తాన్ ఎంపీ

అభినందన్ వర్ధమాన్‌ విడుదల సీక్రెట్ బయట పెట్టిన పాకిస్తాన్ ఎంపీ

వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను.. పాక్ విడుదల చేయడం వెనక సీక్రెట్‌ను బయటపెట్టారు పాకిస్తాన్ నేత అయాజ్ సాదిఖ్. అభినందన్ అరెస్టైన తర్వాత, పార్లమెంటరీ పార్టీ నేతలతో, పాక్ విదేశాంగమంత్రి మహ్మద్ ఖురేషీ సమావేశమైనట్లు తెలిపారు. దయచేసి అభినందన్‌ను విడిచిపెట్టండి. లేకుంటే రాత్రి తొమ్మిది గంటలకు భారత్‌ ఆర్మీ.. మనపై దాడి చేస్తుందని నేతలకు తెలిపారన్నారు.. ఈ మాట వినగానే అక్కడే ఉన్న పాక్ ఆర్మీచీఫ్ బాజ్వా కాళ్లు వణికాయని, ఆయనకు ముచ్చెమటలు పట్టాయని, అదే సమావేశంలో పాల్గొన్న PML-N నేత అయాజ్ సాదిఖ్ తెలిపారు. దీంతో పాక్‌ ఆర్మీ.. అభినందన్‌ను విడుదల చేసినట్లు వివరించారు.