పాకిస్థాన్ ఇంటికి..
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఇక పాకిస్థాన్ జట్టు పోరాటం ముగిసింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పాక్... వరల్డ్ కప్‌లో తన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. భారీ స్కోర్ తేడాతో గెలిస్తే.. సెమీస్‌కు చేరే అవకాశం ఉన్న ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు మాత్రం 315 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇమాముల్ 100, బాబర్ అజామ్ 96, ఇమాద్ 43 పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసి.. బంగ్లా ముందు 316 పరుగుల టార్గెట్ పెట్టింది పాకిస్థాన్. ఇక, బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 5 వికెట్లు తన ఖాతాలో వేసుకోగా... సైపుద్దీన్ మూడు వికెట్లు తీశాడు. ఇక 13 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది బంగ్లాదేశ్... ఈ మ్యాచ్‌లో గెలిచినా పాకిస్థాన్ ఇంటికి వెళ్లడం ఖాయమైపోయింది. కాగా, ఇప్పటికే అన్ని లీగ్ మ్యాచ్‌లు ఆడేసిన న్యూజిలాండ్ జట్టు 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది... ఇక చెరో మ్యాచ్ ఆడాల్సి ఉన్న ఆస్ట్రేలియా 14 పాయింట్లతో టీమిండియా 13 పాయింట్లతో వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. పాక్ ఈ మ్యాచ్ గెలిచినా 11 పాయింట్లతో కివీస్‌తో సమం అవుతుంది.. కానీ, రన్ రేట్ పరంగా కివీస్ జట్టే ముందుండడంతో ఏ విధంగా చూసినా ఇక పాకిస్థాన్‌కు అవకాశంలేకుండా పోయింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)