మోడీ ప్రభుత్వంపై పాక్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..!

మోడీ ప్రభుత్వంపై పాక్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..!

ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్తాన్ ఇండియాపై అవకాశం దొరికినప్పుడల్లా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నది.  భద్రతా మండలిలో పలుమార్లు ఫిర్యాదులు చేసి భంగపడిన పాకిస్తాన్ ఇప్పుడు మోడీ సర్కార్ పై మరికొన్ని వ్యాఖ్యలు చేసింది.  అయితే, ఈసారి ఇమ్రాన్ ఖాన్ కాకుండా, ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి వ్యాఖ్యలు చేయడం విశేషం. పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియా గురించి మాట్లాడిన ఆయన ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు చేశారు.  

కాశ్మీర్ అంశంలో ఇండియా నిప్పుతో చెలగాటం ఆడుతోందని అన్నారు.  ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజనతో సమస్యలు పరిష్కారమవుతాయని భారత ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇది ఎన్నటికీ సాధ్యం కాదని అయన చెప్పారు. ఒకవేళ ఇండియా యుద్దానికి సిద్ధమైతే.. దాన్ని ఎదుర్కొంటామని అన్నారు. పుల్వామా లాంటి దాడుల సాకుతో ఇండియా పాకిస్తాన్ పై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తోందని.. తాము మాత్రం సంయమనం పాటిస్తామని.. తొందరపడి యుద్ధం చేయబోమని అన్నారు.  రాజ్యంగంలో మార్పులు ద్వారా కాశ్మీర్లో పెరిగే తీవ్రవాదానికి తాము భాద్యత వహించబోమని ఆయన స్పష్టం చేశారు.