పాక్ భారీ కుట్ర..! రహస్యంగా మసూద్ విడుదల..!

పాక్ భారీ కుట్ర..! రహస్యంగా మసూద్ విడుదల..!

తన బుద్ధి వంకరే నని మరోసారి రుజువు చేసుకుంది పాకిస్థాన్.. అంతర్జాతయంగా ఒత్తిడి రావడంతో ఈ ఏడాది మేలో మసూద్‌ అజార్‌ను టెర్రరిస్ట్‌గా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న పాకిస్థాన్... మసూద్‌ను అరెస్ట్ చేసినట్టే చేసి... రహస్యంగా విడుదల చేసింది. మసూద్ అజార్ విడుదలకు సంబంధించి భారత నిఘా వర్గాలకు సమాచారం కూడా అందింది. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేయడానికి వీలుగా మసూద్‌ను విడుదల చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కాశ్మీర్ -రాజస్థాన్ సెక్టార్ మధ్యలో పాక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని ఐబీ కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. భారీ కుట్రకు ప్రయత్నిస్తోన్న పాక్.. అందులో భాగంగానే ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేసేందుకు రెండ్రోజుల క్రితం అజార్‌ను రహస్యంగా విడుదల చేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.