పాక్‌కు అసదుద్దీన్ వార్నింగ్...

పాక్‌కు అసదుద్దీన్ వార్నింగ్...

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ... హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ యూత్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పాక్‌ను హెచ్చరించారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని... ఈ విషయంలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని పాకిస్థాన్‌కు సూచించారు అసదుద్దీన్... కశ్మీర్‌తో పాటు కశ్మీరీలు, కశ్మీరీ యువకులు కూడా భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు ఒవైసీ. బీజేపీకైనా, కాంగ్రెస్‌కైనా కాశ్మీర్‌ లోయలో సాధారణ పరిస్థితిని తిరిగి తీసుకురావాలనే దానిపై ఓ విధానం, దృష్టి లేదని ఆరోపించారు.