ఫేవరెట్‌కు షాక్.. బోణీకొట్టిన పాక్‌..

ఫేవరెట్‌కు షాక్.. బోణీకొట్టిన పాక్‌..

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు బోణీకొట్టింది. ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసి.. ఇంగ్లండ్ ముందు 349 పరుగుల భారీ టార్గెట్‌ను పెట్టింది. మహ్మద్ హఫీజ్ 84, బాబర్ ఆజమ్ 63, సర్ఫరాజ్ అహ్మద్ 55 పరుగులు చేసి పాక్‌ భారీ స్కోరుకు సహకరించారు. ఇక 349 పరుగుల విజయక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు లక్ష్య ఛేదనలో చతికిలపడింది. దీంతో పాకిస్థాన్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లో రూట్ 107, జోస్ బట్లర్ 103.. రెండు సెంచరీలతో కదం తొక్కినప్పటికీ మిగితా బ్యాట్స్ మెన్ ఆశించినంత మేర రాణించపోవడంతో కీలక సమయాల్లో వికెట్లు పడటంతో ఇంగ్లండ్ ఛేదనలో వెనుకంజ వేసింది. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసి లక్ష్యానికి 15 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇక మొత్తానికి ఈ విజయంతో వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది పాకిస్థాన్ జట్టు.