ఢిల్లీలో 29 చోట్ల దాడులకు కుట్ర

ఢిల్లీలో 29 చోట్ల దాడులకు కుట్ర

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ భూభాగంలో జైషే మహ్మద్‌ ఉగ్రవాద స్థావరాలను భారత వాయుసేన మట్టుబెట్టడంతో ఉగ్రమూకలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 29 కీలక ప్రదేశాలలో తీవ్రవాద దాడులు చేసేందుకు కుట్ర పన్నాయి. కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టి భగ్నం చేసాయి. ఈ ఘటనతో కేంద్ర హోంశాఖ ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాలు, విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను సిద్ధం  చేసింది.