భారత సినిమాలను నిషేదించిన పాక్

భారత సినిమాలను నిషేదించిన పాక్

బాలాకోట్ లో భారత వాయుసేన జరిపిన మెరుపుదాడుల తరువాత కూడా పాకిస్థాన్ దారికి రాలేదు. ప్రత్యక్ష యుద్ధంలో పోరాడటం చేతకాక భారత సినిమాలపై నిషేదం విధించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి ట్విటర్ లో తెలిపారు. మేడిన్‌ ఇండియా ప్రకటనల్ని కూడా నిషేధించాలని పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎమ్‌ఆర్‌ఏ)కి సూచించారు. ‘భారత కంటెంట్‌ను సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ బహిష్కరించింది. ఇక పాకిస్థాన్‌లో భారత్‌ సినిమాలు విడుదల కావు. మేడిన్‌ ఇండియా ప్రకటనలకు వ్యతిరేకంగా పీఈఎమ్‌ఆర్‌ఏ వ్యవహరించాలని సూచించాం’ అని ఫవాద్‌ ట్వీట్‌ చేశారు.