జమ్మూ కాశ్మీర్ లో బయటపడ్డ మరో సొరంగం... 

జమ్మూ కాశ్మీర్ లో బయటపడ్డ మరో సొరంగం... 

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.  ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను చేరవేసేందుకు తవ్విన ఓ సొరంగాన్ని ఆర్మీ గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ సొరంగాన్ని ఆర్మీ, పోలీసులు కలిసి మూసేశారు.  కాగా, ఇప్పుడు మరో సొరంగాన్ని ఆర్మీ అధికారులు గుర్తించారు .  జమ్మూ కాశ్మీర్లోని సాంబ జిల్లా గులార్ గ్రామంలో ఈ సొరంగాన్ని అధికారులు గుర్తించారు.  170 మీటర్ల పొడవైన సొరంగం గుండా ఉగ్రవాదులను చేరవేస్తున్నట్టు ఆర్మీ, పోలీస్ అధికారులు పేర్కొన్నారు.  డ్రోన్ ద్వారా ఆయుధాలను సరఫరా చేయడం, సొరంగ మార్గం ద్వారా ఉగ్రవాదులను ఇండియాలోకి చేరవేస్తున్నది పాక్.  పాక్ బోర్డర్ నుంచి ఇండియా బోర్డర్ లోని సమీప గ్రామంలోకి ఇలా సొరంగాలు ఏర్పాటు చేసుకొని ఉగ్రవాదులు ప్రవేయిస్తున్నట్టు సమాచారం అందడంతో ఆర్మీ వీటిపై దృష్టి సారించింది.