పాకిస్థాన్‌కు వరుసగా మూడో విజయం

పాకిస్థాన్‌కు వరుసగా మూడో విజయం

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శనివారం లీడ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గానిస్థాన్ పై 3 వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలిచింది. 228 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్ నానా అవస్థలు పడింది. షహీన్‌ అఫ్రిది (4/47), ఇమాద్‌ వసీమ్‌ (2/48), వాహబ్‌ రియాజ్‌ (2/29) విజృంభించడంతో మొదట అఫ్గానిస్థాన్‌ 9 వికెట్లకు 227 పరుగులే చేయగలిగింది. అస్ఘర్‌ అఫ్గాన్‌ (42; 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), నజిబుల్లా (42; 54 బంతుల్లో 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్లు. ఓ దశలో 125కే ఐదు వికెట్లు కోల్పోయిన అఫ్గాన్‌ను నజిబుల్లా ఆదుకున్నాడు. టెయిలెండర్లతో కలిసి స్కోరు 200 దాటించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇమాద్‌తో పాటు బాబర్‌ అజామ్‌ (45; 51 బంతుల్లో 5 ఫోర్లు), ఇమాముల్‌ (36; 51 బంతుల్లో 4 ఫోర్లు) రాణించడంతో లక్ష్యాన్ని పాక్‌ 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.