వరల్డ్‌కప్‌: మళ్లీ ఓడిన పాకిస్థాన్‌

వరల్డ్‌కప్‌: మళ్లీ ఓడిన పాకిస్థాన్‌

వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియా షాకిచ్చింది. భారీ టార్గెట్‌ను ఛేదించేలా కనబడ్డ పాక్‌.. విజయానికి దూరంగానే ఆగిపోయింది. దీంతోఈ ప్రపంచకప్‌లో మూడో విజయం ఆస్ట్రేలియా ఖాతాలో చేరింది. టోర్నీలో నాలుగు మ్యాచులాడిన పాక్‌.. ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్‌ వార్నర్‌ (111 బంతుల్లో 107; 11 ఫోర్లు, సిక్స్‌) సూపర్‌ సెంచరీతోపాటు కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ (84 బంతుల్లో 82; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు.  స్మిత్‌ (10), మ్యాక్స్‌వెల్‌ (20), షాన్‌ మార్ష (23), ఖ్వాజా (18) నిరాశపర్చడంతో ఆసీస్‌.. తమ పది వికెట్లను 28 ఓవర్ల వ్యవధిలో 161 పరుగులకే కోల్పోయింది. ఆమిర్‌ 5 వికెట్లతో విజృంభించాడు.

308 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. వాహబ్‌ రియాజ్‌ (39 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సర్ఫ్‌రాజ్‌ (48 బంతుల్లో 40), ఇమాముల్‌ హక్‌ (75 బంతుల్లో 53 ; 7 ఫోర్లు) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. కమిన్స్‌ మూడు, స్టార్క్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.