వరల్డ్‌కప్‌: కష్టాల్లో పాకిస్థాన్‌

వరల్డ్‌కప్‌: కష్టాల్లో పాకిస్థాన్‌

వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ కష్టాల్లో పడింది. 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్‌ అహ్మద్‌(7), హఫీజ్‌ (8) ఉన్నారు.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ జట్టులో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్‌ 2 పరుగులకే ఔటయ్యాడు. మంచి జోరు మీద కనిపించిన మరో ఓపెనర్‌ జమన్‌(22: 16 బంతుల్లో 2x4, 1x6).. ఆండ్రీరసెల్‌ వేసిన ఆరో ఓవర్‌ ఐదో బంతికి బౌల్డయ్యాడు. ఆ తర్వాత  హ్యారిస్‌ సోహైల్‌(8),  బాబర్‌ ఆజామ్‌ (22: 33 బంతుల్లో 2x4) కూడా వెంటవెంటనే అవుటవడంతో పాక్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది.