క్రికెట్ పై కాశ్మీర్ ఎఫెక్ట్.!!

క్రికెట్ పై కాశ్మీర్ ఎఫెక్ట్.!!

ప్రపంచంలో ఎక్కువ ఆదరణ ఉన్న గేమ్స్ లో క్రికెట్ ఒకటి.  దాయాదుల మధ్య అంటే ఇండియా.. పాక్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు.  నెల రోజుల ముందుగానే టికెట్ సేల్స్ అవుతాయి.  స్టేడియం ఫుల్ అవుతుంది.  అది ఏ ఫార్మాట్ అయినా కావొచ్చు.  మ్యాచ్ జరిగినంత సేపు ఉత్కంఠత ఉంటుంది.  అయితే, ఆర్టికల్ 370 రద్దు తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో... రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగడం కష్టంగానే మారింది.  గతంలో ఇండియా మహిళల జట్టు పాక్ లో పర్యటించాల్సి ఉన్నది.  

అయితే, పాక్ లో భద్రతా ఉండదని భావించిన ఇండియా ఆ పర్యటనను రద్దు చేసుకుంది.  ఇండియా పర్యటనను రద్దు చేసుకోవడంతో.. పాక్ ఖాతాతో పాయింట్లు వెళ్లిపోయాయి.  ఇప్పుడు ఇండియాలో పాక్ మహిళల జట్టు పర్యటించాల్సి ఉన్నది.  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాక్ జట్టు ఇండియాలో పర్యటిస్తుందా అన్నది అనుమానంగానే మారింది.  ఇండియా ఈ మ్యాచ్ లను రద్దు చేస్తే... మళ్ళా పాక్ ఖాతాతో పాయింట్లు వెళ్లిపోతాయి.  పాక్ జట్టు పర్యటన విషయం తమ చేతుల్లో లేదని, కేంద్రం అనుమతి ఇస్తే.. మ్యాచ్ లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బిసిసిఐ చెప్తోంది.  ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తరువాతే తమ నిర్ణయం ఉంటుందని బిసిసిఐ పేర్కొంది.