జింబాబ్వేపై పాక్ విజయం

జింబాబ్వేపై పాక్ విజయం

సోమవారం బులవాయో స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49.2 ఓవర్లలో 194 పరుగులకు ఆల్ అవుట్ అయింది. జింబాబ్వే ఆటగాళ్లు ఆరంభం నుంచే తడబడి వికెట్లు సమర్పించుకున్నారు. జింబాబ్వే కెప్టెన్ మసకడ్జ(59), పీటర్ మూర్(50)లు అర్ధ సెంచరీలు సాధించారు. పాక్‌ బౌలర్లు ఉస్మాన్‌ నాలుగు , హసన్‌ అలీ మూడు వికెట్లు తీశారు.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 36 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 195 పరుగులు చేసి విజయం సాధించింది. పాక్ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌(117 నాటౌట్‌; 16 ఫోర్లు) అజేయ శతకంతో కీలక పాత్ర పోషించాడు. జమాన్‌.. ఇమాముల్‌ హక్‌ (44), ఆజమ్‌ (29 నాటౌట్‌)తో కలిసి విలువైన బాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 'ప్లేయర్ అఫ్ ది మ్యాచ్' ఫఖర్‌ జమాన్‌కు దక్కింది.