కశ్మీరే మా అజెండా.. చివరి బుల్లెట్ వరకూ పోరాటం..!

కశ్మీరే మా అజెండా.. చివరి బుల్లెట్ వరకూ పోరాటం..!

జమ్మూ కశ్మీర్‌.. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను పెంచుతూనే ఉంది... ప్రజలను రెచ్చగొట్టడంలో మాత్రం పాకిస్థాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.. విద్వేషపూరిత వ్యాఖ్యలతో భారత్‌పై విషాన్ని చిమ్ముతూనే ఉన్నారు. కశ్మీర్ కోసం భారత్‌పై యుద్ధానికైనా తాము సిద్ధమేనని ప్రకటించారు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ భజ్వా... కశ్మీర్ ఇప్పుడు హిందూత్వ బాధిత ప్రాంతమని వ్యాఖ్యానించిన ఆయన.. వేధింపులు అక్కడ నిత్యకృత్యం అయ్యాయని ఆరోపించారు. ఇక, కశ్మీరే పాకిస్థాన్ ఎజెండా. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము సవాలుగా తీసుకుంటున్నామని ప్రకటించారు. 

ఇక, తాము ఎప్పికటీ కశ్మీరీలను ఒంటరిగా విడిచిపెట్టబోమని ప్రకటించాడు జావేద్ భజ్వా.. కశ్మీర్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని.. ఆఖరి సైనికుడి వరకు, చివరి బుల్లెట్ వరకు, తుది శ్వాస వరకు మా పోరాటం కొనసాగుతోందని వెల్లడించాడు. కశ్మీర్ కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు తమ ఆర్మీ సిద్ధంగా ఉందన్ని విషాన్ని చిమ్మాడు. ఇలా ఓవైపు పాక్ ప్రధాని, మంత్రులు.. ఇలా రోజూకో తరహాలో కశ్మీర్‌ విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగేలా చేస్తున్నారు. భారత్ కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయం, ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడంలో విఫలమైన పాకిస్థాన్.. కశ్మీర్ విషయంలో కొత్తి అంశాలను తెరపైకి తెచ్చి వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉంది.