మానవత్వం చాటుకున్న పాక్ క్రికెటర్... మెచ్చుకున్నా భారత క్రికెటర్..

మానవత్వం చాటుకున్న పాక్ క్రికెటర్... మెచ్చుకున్నా భారత క్రికెటర్..

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా పేరు వింటే వణికి పోతుంది . ఈ వైరస్ ప్రభావం మొత్తం 195 దేశాల పైన ఉంది. అయితే మన దేశం తో పాటు పాకిస్థాన్ పైన కూడా ఈ వైరస్ ప్రభావం అధికంగానే ఉంది. పాక్ లో ఇప్పటికే 1,130 కేసులు నమోదుకాగా 9 మంది మరణించారు. అయితే కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న 2 వేల కుటంబాలకు పాక్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది రేషన్ బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు అందజేశాడు. దీనికి సంబంధించిన పోస్ట్ ను ఆఫ్రీది తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అయితే దానికి స్పందించిన భారత బౌలర్ హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా ఆఫ్రీది పై ప్రశంశల వర్షం కురిపించాడు. అయితే దానికి పాక్ ఆటగాడి ఆఫ్రీది  ధన్యవాదాలు తెలిపాడు.