తోకముడిచిన పాక్ యుద్ద విమానాలు

తోకముడిచిన పాక్ యుద్ద విమానాలు

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలపై భారత్‌ భీకరదాడికి పాల్పడిన తరువాత కూడా పాకిస్థాన్ వైఖరిలో మార్పు రాలేదు. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత ఫార్వర్డ్ పోస్టులపై భారీ మోర్టార్ షెల్‌లతో కాల్పులకు తెగబడింది. జమ్ము, రాజౌరి, ఫూంచ్ జిల్లాల్లోని 55 ఫార్వర్డ్ పోస్టులు, ప్రజల నివాసాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటి బాలాకోట్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తరువాత పాక్ కవ్వింపు చర్యలకు దిగుతుంది. పాక్ యుద్ద విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పాక్ విమానాలను నౌషీరా వద్ద కూల్చివేశారు. భారత వైమానిక దాడులను తట్టుకోలేక మిగతా విమానాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో గల జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌తో పాక్ ఈ కవ్వింపు చర్యలకు దిగుతుంది.