జైపూర్ సెంట్రల్ జైల్లో పాక్ ఖైదీ హత్య

జైపూర్ సెంట్రల్ జైల్లో పాక్ ఖైదీ హత్య

జైపూర్ సెంట్రల్ జైల్లో బందీగా ఉన్న పాకిస్థానీ ఖైదీని హత్య చేశారు. ఈ ఖైదీ తోటి ఖైదీలతో గొడవ పడ్డాడని, వాళ్లు ఇతడిని కొట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. టీవీ చూడటం కోసం ప్రారంభమైన గొడవ ముదిరి ముగ్గురు ఖైదీలు పాక్ ఖైదీని దారుణంగా కొట్టడంతో అతను మరణించాడు. ఈ సంఘటన గురించి తెలియగానే రాష్ట్ర పోలీస్, అధికార యంత్రాంగం ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫొరెన్సిక్ టీమ్ కూడా అక్కడికి చేరుకొంది. రాష్ట్ర జైళ్ల డీజీపీ రూపిందర్ సింగ్ ఈ హత్యకు దారితీసిన ఘటనాక్రమాన్ని వివరించారు. ఈ ఖైదీ పాకిస్థాన్ లోని సియాల్ కోట్ వాసి. 2011 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2017లో అతనికి జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది.