రెండో పెళ్లి చేసుకునే వాళ్లకు బంపర్ అఫర్... అక్కడ అది ఫ్రీ... షరతులు వర్తిస్తాయి... 

రెండో పెళ్లి చేసుకునే వాళ్లకు బంపర్ అఫర్... అక్కడ అది ఫ్రీ... షరతులు వర్తిస్తాయి... 

మనదేశంలో ఒక పెళ్లికే అనుమతి ఉంటుంది.  రెండో పెళ్లి చేసుకోవాలి అంటే తప్పని సరిగా మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలి.  చట్టబద్ధంగా ఈ పని జరిగిన తరువాతే రెండో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.  కానీ, పాకిస్తాన్ లో అలా కాదు.  ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు.  వారి సత్తాను బట్టి ఉంటుంది.  

అయితే, అక్కడ ఒకటికంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే.  పాకిస్తాన్ లోని బవల్పూర్ లో కొత్తగా ఓ కల్యాణమండపం ఏర్పాటు చేశారు.  కొత్తగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడంతో కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నారు. రెండో పెళ్లి చేసుకునే వాళ్లకు ఆ కళ్యాణ మండపం 50 శాతం రాయితీ ఇస్తుంది.  అదే మూడో పెళ్లి చేసుకుంటే 75శాతం రాయితీ, నాలుగో పెళ్లి చేసుకునే వాళ్లకు కళ్యాణ మండపాన్ని ఫ్రీగా ఇస్తారట.  అయితే, విడాకులు తీసుకోకూడదు.  అంతేకాదు, ఆ కళ్యాణ మండపాన్ని మాజీ భార్య లేదా భార్యలు బుక్ చేయాల్సి ఉంటుంది.  ఈ న్యూస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.