గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన పాక్‌

గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన పాక్‌

వరల్డ్‌కప్‌లో మరి ఆసక్తికర మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్‌ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. సెమీస్‌కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టాస్‌ ఓడింది. ఆఫ్గాన్‌ కెప్టెన్ నైబ్ టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లోనూ ఆఫ్గాన్ ఓడింది. ఇక.. గత రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఉత్సాహంతో ఉన్న పాక్‌.. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచాలని భావిస్తోంది.