ముగిసిన ఆఫ్గాన్‌ బ్యాటింగ్‌.. పాక్‌ టార్గెట్‌ ఇదీ..

ముగిసిన ఆఫ్గాన్‌ బ్యాటింగ్‌.. పాక్‌ టార్గెట్‌ ఇదీ..

వరల్డ్‌కప్‌లో భాగంగా లీడ్స్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. నజీబ్‌(42; 54బంతుల్లో, 6 ఫోర్లు), అస్ఘర్‌ (42; 35బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఓపెనర్‌ రహ్మత్‌ షా 35 పరుగులు, వికెట్‌ కీపర్‌ ఇక్రామ్‌ 22 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అఫ్రిదీ 4 వికెట్లు తీయగా.. వసీం, రియాజ్‌ చెరో రెండు వికెట్లు తీశారు. షాదాబ్‌ ఖాన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.