లాక్ డౌన్ ఎఫెక్ట్: సైకిల్ పై ఆ ఎమ్మెల్యే ఏలూరు వరకు ప్రయాణం... ఎందుకంటే.. 

లాక్ డౌన్ ఎఫెక్ట్: సైకిల్ పై ఆ ఎమ్మెల్యే ఏలూరు వరకు ప్రయాణం... ఎందుకంటే.. 

లాక్ డౌన్ కారణంగా దేశంలోని ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.  ఎవరూ బయటకు రాలేని పరిస్థితి.  ట్రాన్స్ఫపోర్ట్ ఫెసిలిటీ లేదు.  ప్రజా ప్రతినిధులు కూడా నియోజక వర్గాలకే పరిమితం అయ్యి అక్కడి పరిస్థితులపై దృష్టి పెట్టారు.  కరోనా ప్రభావం వలన అక్కడి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. కరోనా కారణంగా రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది.  ముఖ్యంగా ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

ప్రభుత్వం ఆక్వారైతులకు సంబంధించి హామీలు ఇస్తున్నా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.  ఆక్వారైతులు పడుతున్న ఇబ్బందులను, రైతుల పంటలకు సంబంధించిన విషయాలను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ తో మాట్లాడేందుకు, కలెక్టర్ కు వినతిపత్రం అందించేందుకు పాలకొల్లు ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ నేత నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి సైకిల్ మీద ఏలూరు బయలుదేరి వెళ్లారు.  ఆక్వారైతుల పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ ఆయన డిమాండ్ చేస్తున్నారు.