పుట్టిన రోజునా ఛాలెంజ్ లే...కాకపోతే గ్రీన్ !

పుట్టిన రోజునా ఛాలెంజ్ లే...కాకపోతే గ్రీన్ !

రాజకీయాల్లో ఛాలెంజ్ లు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మామూలే. అయితే తెలంగాణాలో మాత్రం ఒక ఛాలెంజ్ నడుస్తోంది. అదే గ్రీన్ ఛాలెంజ్. రాజ్య సభ ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన ఆ ఛాలెంజ్ విరివిగా నడుస్తోంది. ఈ రోజు తెలంగాణ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు  MLC డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన సందర్భంగా,  రాజ్య సభ ఎంపీ శ్రీ జే.సంతోష్ కుమార్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీన్ ఛాలెంజ్ విసరగా , దానికి స్పందిస్తూ , తన ఇంటి ఆవరణలో దానిమ్మ , సీతాఫలం మరియు సంపంగి చెట్లను నాటారు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి.