ఆధార్‌-పాన్ లింక్‌కు ఇదే డెడ్‌లైన్..! ఆ తర్వాత ఇక అంతే..!

ఆధార్‌-పాన్ లింక్‌కు ఇదే డెడ్‌లైన్..! ఆ తర్వాత ఇక అంతే..!

ఆధార్‌-పాన్‌ కార్డ్ లింక్‌కు ఇప్పటికే పలు దఫాలుగా తేదీలను పొడిగిస్తూ వచ్చిన ఆదాయపన్నుశాఖ.. ఇక డెడ్‌లైన్ పెట్టేసింది. ఈ డెడ్‌లైన్‌లోగా ఆధార్-పాన్ వివరాలు అనుసంధానం చేసుకోకపోతే.. ఐటీ చట్టం ప్రకారం అన్ని పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రకటించింది. 2020 మార్చి 31 వరకు ఆధార్-పాన్ లింక్‌ను అవకాశం ఉందని ఆదాయపు పన్ను విభాగం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఐటీ డిపార్ట్ ప్రకారం ఇప్పటి వరకు 30.75 కోట్లకు పైగా శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఆధార్‌తో అనుసంధానం కాగా.. జనవరి 27, 2020 వరకు... ఇంకా దాదాపు 17.58 కోట్ల మంది తన ఆధార్-పాన్ లింక్ చేయాల్సి ఉంది. ఐటీ డిపార్ట్‌మెంట్ తాజా నోటిఫికేషన్ ప్రకారం.. మార్చి 31 తర్వాత ఆ పాన్ కార్డులు పనిచేయకుండా పోతాయి. 

అయితే, ఆధార్-పాన్ లింక్ చేయకపోతే మాకొచ్చె నష్టం ఏంటి? అని తేలికగా తీసుకోవడానికి మాత్రం లేదు.. ఎందుకంటే కనీసం 18 రకాల ఆర్థిక లావాదేవీలు చేసే అవకాశాన్ని కోల్పోతారు. వాటిలో వాహనం అమ్మకం లేదా కొనుగోలు (ద్విచక్ర వాహనాలను మినహాయించి), డెబిట్ / క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆదాయపు పన్ను నిబంధనల 114 బీ నిబంధన ప్రకారం డిమాట్ ఖాతా తెరవడం వంటివి కూడా చేయడం కుదరదు. అంతేకాకుండా, పనికిరాని పాన్ కార్డు ఉన్న ఏ వ్యక్తి అయినా శాశ్వత ఖాతా సంఖ్యను ఇవ్వడం, తెలియజేయడం లేదా కోట్ చేయకపోతే ఐటీ చట్టం ప్రకారం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ (2) ప్రకారం, జూలై 1, 2017 నాటికి పాన్ ఉన్న, మరియు ఆధార్ పొందటానికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తి తన ఆధార్ నంబర్‌ను పన్ను అధికారులకు తెలియాల్సి ఉంటుంది.