పాన్-ఆధార్ లింక్‌కు కొత్త డెడ్‌లైన్..! లేక పోతే అంతే..?

పాన్-ఆధార్ లింక్‌కు కొత్త డెడ్‌లైన్..! లేక పోతే అంతే..?

పాన్-ఆధార్ లింక్‌కు కొత్త డెడ్‌లైన్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం... ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు ఇకపై పాన్‌కు బదులు ఆధార్‌ను ఉపయోగించొచ్చని ఇటీవల బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండింటిలో దేన్నైనా ఉపయోగించొచ్చని సూచించారు. అయితే, పాన్‌-ఆధార్‌ అనుసంధానం మాత్రం యథావిధిగా కొనసాగనుంది. ఈ ప్రక్రియ ఆగస్టు 31వ తేదీలోపు లింక్ చేయకుంటే పాన్‌ను చెల్లనిదిగా గుర్తించనున్నట్టు ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఐటీ ఫైలింగ్‌కు ఆధార్‌ను ఉపయోగించినప్పుడు సంబంధిత కార్డు పాన్‌ కార్డుతో అనుసంధానం కాకపోతే ఇకపై కొత్త వర్చువల్‌ పాన్‌ నంబర్‌ కేటాయించనున్నారు. అదే పాన్‌ నంబర్‌గా గుర్తించనున్నారు. అయితే, పాన్‌ కార్డు లేనివారికీ ఇది ఒక విధంగా ఉపయోకరం కానుండగా... కాగా, ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం కాని వాటిని తొలుత తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఒకసారి అనుసంధానం చేశాక వాటిని పునరుద్ధరించుకునే అవకాశం ఇవ్వనున్నారు... లేని పక్షంలో శాశ్వతంగా తొలగించనున్నట్టు వెల్లడించనున్నారు. మరోవైపు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 కోట్ల పాన్‌ కార్డులు ఉండగా... 22 కోట్లు మాత్రమే ఆధార్‌తో లింక్ చేయబడ్డాయి. మిగతా పాన్‌ కార్డులు లింక్‌ చేయాల్సి ఉంది.