టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి

టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి

కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఆమె భర్త కృష్ణయ్య టీడీపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పనబాక దంపతులకు బాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తిరుపతి పార్లమెంట్‌ సిగ్మెంట్‌ నుంచి పనబాక లక్ష్మి బరిలోకి దిగనున్నారు.